Bandla ganesh: గురూజీకి ఖరీదైన బహుమతి ఇస్తే.. నిర్మాతగా మారచ్చు: బండ్ల గణేశ్‌

బండ్ల గణేశ్‌ (Bandla ganesh) ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ నెటిజన్లును ఆకట్టుకుంటోంది.

Published : 26 May 2023 14:51 IST

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla ganesh) సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు. రోజూ ఏదో ఒక పోస్ట్‌ పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు కామెంట్స్‌కు రిప్లైలు పెడుతూ హైలైట్‌ అవుతుంటారు. తాజాగా అలా ఓ ట్వీట్‌కు రిప్లై ఇచ్చి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఈరోజు ఉదయాన్నే గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ బండ్ల గణేశ్‌ ఒక స్ఫూర్తిమంతంమైన కొటేషన్‌ షేర్‌ చేశారు. ఆ పోస్ట్‌కు కామెంట్‌ పెట్టిన ఓ అభిమాని ‘నాకు కూడా మీలాగా నిర్మాత కావాలని ఉంది. ఏం చేయాలో ఐడియా చెప్పండి’ అని అడిగారు. దీనికి తనదైన శైలిలో స్పందించిన బండ్ల గణేశ్‌ ‘నిర్మాత కావాలంటే గురూజీని కలవండి. ఆయనకు ఖరీదైన బహుమతి ఇవ్వండి’ అని రిప్లై ఇచ్చారు. దానితో పాటు మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మన గురూజీ భార్యాభర్తల్ని, తండ్రీకొడుకులను, గురుశిష్యులను ఎవరినైనా వేరు చేస్తాడు. అది ఆయనకు ఉన్న స్పెషాలిటీ’ అంటూ సరదా ఎమోజీని పెట్టారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు వైరలవుతుండగా. నెటిజన్లు ఆ గురూజీ ఎవరో చెప్పాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరేమో ‘గణేష్‌ అన్నా నువ్వు మాటల మాంత్రికుడివి.. ఏదైనా మార్చేస్తావు’ అని అంటున్నారు.

ఇక తాజాగా బండ్ల గణేశ్‌ ‘దేవర’ (Devara) టైటిల్‌ వియంలోనూ ఆసక్తికర ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘దేవర’ తాను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న టైటిల్‌ అని.. తాను మర్చిపోవడం వల్ల కొట్టేశారని అన్నారు. మళ్లీ వెంటనే ఎన్టీఆర్‌ కూడా తనకు దేవరతో సమానమని చెప్పారు. దీనిపై నెటిజన్లు పంచ్‌ డైలాగులు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని