Bhamakalapam 2: మీ సినిమాలో ‘పోకిరి’ని మించిన ట్విస్ట్‌ ఉంటుందా?: దర్శకుడు అభిమన్యు ఆన్సర్‌ ఏంటంటే..

ప్రియమణి నటించిన ‘భామాకలాపం 2’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టీమ్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.

Published : 14 Feb 2024 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో దర్శకుడు అభిమన్యు తెరకెక్కించిన చిత్రం ‘భామాకలాపం 2’ (Bhamakalapam 2). నేరుగా ‘ఆహా’ వేదికగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ‘భామాకలాపం’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందింది. అదే ఓటీటీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రియమణి, అభిమన్యు, ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సీరత్‌ కపూర్, శరణ్య పాల్గొన్నారు. వారు చెప్పిన సంగతులివీ..

* ఈ సినిమాలో ‘పోకిరి’ని మించిన ట్విస్ట్‌ ఉండబోతుందా?

అభిమన్యు: రెండు రోజుల్లో సినిమా చూస్తారు కదా. మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి.. ట్విస్ట్‌లు చాలా ఉన్నాయని చెప్పగలను.

* పార్ట్‌ 1 చూడకపోయినా పార్ట్‌ 2 అర్థమవుతుందా?

అభిమన్యు: తొలి భాగం చూడకపోయినా అర్థమవుతుంది. కానీ, ఫస్ట్‌ పార్ట్ చూసి ఉంటే సెకండ్‌ పార్ట్‌లోని పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు.

* తొలి భాగంలో అనుపమగా ఎంతో సాహసం చేశారు. ఇందులో ఉందా?

ప్రియమణి: ఇందులో రెట్టింపు సాహసం చేశా. సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపిస్తానో లేదో సినిమా చూసి తెలుసుకోండి.

* నిజ జీవితంలో మీరు బాగా వండే వంటకం?

ప్రియమణి: తెరపైనేగానీ తెర వెనుక నేనేం వండను. మా భర్త వండితే బాగా తింటా.

* రియల్ లైఫ్‌లో మీ భర్తకు మీరు భయపడతారా?

ప్రియమణి: కొన్ని సార్లు భయపడతా. కొన్ని సందర్భాల్లో ఆయన్ను నేను భయపెడతా (నవ్వుతూ)

*  రవితేజతో కలిసి ‘శంభో శివ శంభో’లో నటించారు. ఆయన గురించి చెబుతారా?

ప్రియమణి: చాలా కాలం తర్వాత ఈ రోజే రవితేజను మీట్‌ అయ్యా. అప్పుడు ఎంత ఎనర్జిట్‌గా ఉండేవారో ఇప్పుడూ అలానే ఉన్నారు.

* సీరత్‌.. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

సీరత్‌ కపూర్‌: ఈ స్క్రిప్టు బాగా నచ్చడంతో నటించేందుకు వెంటనే ఓకే చెప్పా. నేనిందులో గ్లామర్‌ రోల్‌ ప్లే చేశా. అది ఎలా ఉంటుందో రివీల్ చేయలేను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని