Bhamakalapam2: ఓటీటీలో ‘భామాకలాపం2’ రికార్డు వ్యూస్‌

Bhamakalapam2: ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘భామా కలాపం2’ మంచి వ్యూస్‌ను దక్కించుకుంటోంది.

Published : 22 Feb 2024 19:41 IST

హైదరాబాద్‌: ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ మూవీ కొనసాగింపుగా ఇటీవల వచ్చిన చిత్రం  ‘భామా కలాపం 2’ (Bhamakalapam2). ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ 100+ మిలియన్‌ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. తొలి భాగాన్ని మించిన థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు ప్రియమణి నటన, అభిమన్యు టేకింగ్‌ సినీ ప్రియులను అలరించాయి.

కథేంటంటే: అనుపమ (ప్రియమణి) యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌కతా మ్యూజియంలో రూ.200 కోట్ల విలువైన కోడిగుడ్డు మాయమవడంతో అనుపమ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఎలాగో ఆ కష్టాల నుంచి బయటపడటం పార్ట్‌-1 స్టోరీ. ఆపద నుంచి తప్పించుకున్న ఆమె కుటుంబం ఇల్లు మారడంతో పార్ట్‌-2 ప్రారంభమవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చిన అనుపమ యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో హోటల్‌ ప్రారంభిస్తుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను వ్యాపార భాగస్వామిని చేస్తుంది. ఇకపై ‘హ్యాపీలైఫ్‌’ అనుకునేలోపు మరో సమస్య వచ్చి పడుతుంది. దాని పరిష్కారం కోసం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ అధికారిని సంప్రదించగా ఆయన ముందు ఓకే అంటాడు. ఆ తర్వాత రోజు రెండు ఆప్షన్లు ఇచ్చి చావోరేవో తేల్చుకోమంటాడు. ఆయన ఎందుకు అలా మారాడు? రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించే క్రమంలో అనుపమ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? అసలు అందులో ఏముంది? జుబేదా (సీరత్‌ కపూర్‌) రోల్‌ఏంటి? అన్నది కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని