Bhumi Pednekar: యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌.. భూమి

‘దమ్‌ లగాకే హైస్సా’, ‘భక్షక్‌’ లాంటి చిత్రాలతో ఉత్తమ నటిగా నిరూపించుకున్న భూమి పెడ్నేకర్‌ మరో కొత్త పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి తెరపై కాకుండా.. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా కనిపించనుంది.

Published : 22 May 2024 01:04 IST

‘దమ్‌ లగాకే హైస్సా’, ‘భక్షక్‌’ లాంటి చిత్రాలతో ఉత్తమ నటిగా నిరూపించుకున్న భూమి పెడ్నేకర్‌ మరో కొత్త పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి తెరపై కాకుండా.. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా కనిపించనుంది. తన ‘క్లైమేట్‌ వారియర్‌ అండ్‌ భూమి ఫౌండేషన్‌’ ద్వారా పర్యావరణానికి చేస్తున్న విశేష సేవలకుగానూ యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఆమెను ఎంపిక చేసినట్టు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ తాజాగా ప్రకటించింది. రాజకీయాలు, వ్యాపారం, పౌర సమాజం, కళలు, విద్యాసంస్థలకు చెందిన కొందరి జాబితాను డబ్ల్యూఈఎఫ్‌ ప్రకటించింది. దీంతో భూమి 2025లో జరిగే ప్రఖ్యాత దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఎంపికవడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నా. ఈ ఏడాది సింగపూర్‌లో జరిగే సదస్సుతోపాటు వచ్చే ఏడాది దావోస్‌ సదస్సులోనూ పాల్గొంటాను. పర్యావరణ ప్రేమికురాలిగా, నటిగా ఆ ప్రపంచ వేదికపై నా వాణి బలంగా వినిపిస్తాను’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది భూమి. తను ప్రస్తుతం ‘మేరీ పత్నీ కా రీమేక్‌’లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని