Bhumi Pednekar: ఆ పాత్ర నన్ను థ్రిల్‌ చేసింది: భూమి పెడ్నేకర్‌

నటి భూమి పెడ్నేకర్‌ తాను నటించిన వెబ్‌సిరీస్‌ గురించి మాట్లాడారు.

Published : 21 Mar 2024 22:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భక్షక్‌’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి భూమి పెడ్నేకర్‌ (Bhumi Pednekar). ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆమె ‘దల్దాల్‌’ (Daldal) వెబ్‌సీరీస్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు. భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అమృత్‌ రాజ్‌గుప్తా తెరకెక్కించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీనిని రూపొందించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సిరీస్‌లో భూమి లుక్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల చేసింది. సోషల్‌మీడియాలో ఆమె ఆ ఫొటోను షేర్‌ చేశారు.

‘‘ఈ సిరీస్‌ గ్లోబల్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుందని ఊహించలేదు. నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను, సిరీస్‌ను ప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘దల్దాల్‌’లో సిరీయల్‌ కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీస్‌ ఆఫీసర్‌ చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇది చాలా మంచి కథ. కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇందులో డీసీపీ రీటా ఫెరీరాగా కనిపిస్తాను. అధిక ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రలో నటించేందుకు చాలా థ్రిల్‌ ఫీల్‌ అయ్యాను. శక్తివంతమైన ఆ పాత్ర నన్ను మరిన్ని మంచి సినిమాలు చేసేందుకు ప్రేరేపించింది. సహజంగా సవాళ్లు ఎదుర్కొనే చిత్రాలను ఎంచుకునేందు ఆసక్తి చూపిస్తాను. అందులో భాగంగానే ఈ సిరీస్‌లో నటించాను. ‘భక్షక్‌’ను ఆదరించినట్లే ఈ సిరీస్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు అమృత్‌ రాజ్‌గుప్తాకు కృతజ్ఞతలు’’ అని భూమి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని