Bhumi Pednekar: ఈ దేశపు అతివలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు: భూమి పెడ్నేకర్‌

భక్షక్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న భూమి పెడ్నేకర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

Published : 28 Feb 2024 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు భూమి పెడ్నేకర్‌ (Bhumi Pednekar). ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘భక్షక్‌’ (Bhakshak) చిత్రంలో జర్నలిస్టు వైశాలీసింగ్‌  పాత్రలో నటించి సినీప్రియుల ప్రశంసలు అందుకున్నారు. ఈనేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తనకు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించాలని ఉందన్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో మన దేశంలో ఉన్న కొందరు మహిళలు సత్తా చాటుతున్నారు. నేను కూడా భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలని అనుకుంటున్నా. అలాగని తొందరపాటు నిర్ణయాలు తీసుకోను.  ‘భక్షక్‌’ సినిమాతో నేను నేర్చుకున్న పాఠాలు, అనుభవాలతో ముందుకుసాగుతాను. కథకు తగ్గ పాత్రను ఎంచుకుంటూ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తాను. నటీనటులు ఎవరైనా వారు తమ ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ప్రదర్శించాలనుకుంటారు. ప్రపంచంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా రూపొందే చిత్రాల్లో ఎవరికి తగ్గ పాత్రలు వారు చేయాలనుకుంటారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మినీసిరీస్‌ ‘వన్‌డే’లో నటించిన అంబికా మోడ్‌ మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రేక్షకులు నాయికా ప్రాధాన్యమున్న పాత్రలను ఆదరిస్తున్నారు. నేను ఆ స్థాయిలో రాణించాలంటే ఇదే సరైన సమయం అని అనుకుంటున్నా’’ అని భూమి పేర్కొన్నారు.

భూమి పెడ్నేకర్‌ ‘దమ్‌ లగా కే హైషా’ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన భక్షక్‌ చిత్రంలో నటించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కమ్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌గా పులకిత్‌ దీనిని తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు