Swetha Varma: ‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్‌ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్‌ నటి ఆగ్రహం

తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 24 Apr 2024 12:42 IST

హైదరాబాద్‌: తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్‌ 5 ఫేమ్‌ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పనిలేని వారే ఈవిధంగా కామెంట్స్‌ చేస్తారని అన్నారు. ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

బిగ్‌బాస్‌ 5 తర్వాత పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశారు శ్వేతావర్మ. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తరచూ తన ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. ఇటీవల ఓ నెటిజన్‌ ఇన్‌స్టా వేదికగా ఆమె ఫొటో షేర్‌ చేస్తూ అభ్యంతరకరంగా మెసేజ్‌ చేశాడు. దీనిపై శ్వేత అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి కామెంట్స్‌ ఎలా చేయగలుగుతున్నారు? అతడి ఇంట్లోవాళ్లపై ఎవరైనా ఇదే కామెంట్‌ చేస్తే ఓకేనా?. ఇలాంటి వారిని చూస్తుంటే సిగ్గేస్తుంది. ఈ వ్యక్తి ఫోన్‌ నంబర్‌, ఇంటి అడ్రస్‌ సంపాదించి వాటినీ షేర్‌ చేయగలను. కానీ నేను అలా చేయను. తన తప్పు తెలుసుకుంటాడని భావిస్తున్నా. దీన్ని రిపీట్‌ చేయడనుకుంటున్నా’’ అని అన్నారు. ‘పనిలేని పులిరాజు’, ‘మ్యాడ్‌’, ‘ది రోజ్‌ విల్లా’, ‘రాణి’, ‘సంజీవని’ వంటి చిత్రాల్లో శ్వేతా వర్మ నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని