Amitabh Bachchan: 19 ఏళ్ల ‘బ్లాక్‌’.. ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

అమితాబ్‌ బచ్చన్‌, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘బ్లాక్‌’. ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 04 Feb 2024 22:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ చిత్రం ‘బ్లాక్‌’ (Black) డిజిటల్‌ రిలీజ్‌ అయింది. 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Black on Netflix)లో ఆదివారం విడుదలైంది. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), రాణీ ముఖర్జీ (Rani Mukerji) ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా ఇది. 2005 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ సందర్భంగా అదే తేదీన ఓటీటీలోకి వచ్చింది. ‘‘బ్లాక్ సినిమాకు 19 ఏళ్లు. దేబ్రాజ్, మిచెల్ ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మీకూ స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం’’ అని అమితాబ్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

దేబ్రాజ్ అనే టీచర్​ రోల్​లో అమితాబ్‌ ఆకట్టుకున్నారు. దివ్యాంగురాలు మిచెల్‌గా రాణీ ముఖర్జీ నటన అద్భుతం. అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 3 విభాగాల్లో ‘నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’, 11 విభాగాల్లో ‘ఫిల్మ్‌ఫేర్‌’, 9 విభాగాల్లో ‘ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ’ అవార్డులు సొంతం చేసుకుని సత్తా చాటింది.

త్వరలోనే రెండు భారీ ప్రాజెక్టులతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించనున్నారు అమితాబ్‌. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), రజనీకాంత్‌ (Rajinikanth) ప్రధాన పాత్రలో దర్శకుడు టి.జి. జ్ఞానవేల్‌ రూపొందిస్తున్న ‘వేట్టయాన్‌’ (Vettaiyan)లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని