Pushpa 2: ఇది పక్కా సూపర్ హిట్‌: ‘పుష్ప 2’పై బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు

అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న యాక్షన్‌ డ్రామా ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). ఈ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్‌ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు.

Published : 15 Apr 2024 16:36 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘పుష్ప ది రూల్‌’పై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనిల్‌శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందన్నారు. తాజాగా టీజర్‌ వీక్షించిన ఆయన ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశా. సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. గతేడాది ఆగస్టు 15న నేను దర్శకత్వం వహించిన ‘గదర్‌ 2’ విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది అదే రోజున విడుదల కానున్న ‘పుష్ప 2’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ, చిత్ర బృందానికి నా అభినందనలు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ లుక్‌, నటన అత్యద్భుతంగా ఉంది.’’ అని అన్నారు. దీనిపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). రష్మిక కథానాయిక. పార్ట్‌-1లో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్‌ (Fahadh Faasil) ఎస్పీ భన్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. శ్రీవల్లి.. పుష్పకు భార్యగా కనిపించనుంది. ఇటీవలే ఈ పాత్ర గురించి చెప్పిన రష్మిక మాట్లాడుతూ.. శ్రీవల్లి 2.0 చూస్తారని అన్నారు. అల్లు అర్జున్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్‌ 8న టీజర్‌ విడుదలైంది. గంగమ్మ తల్లి జాతర నేపథ్యంలో సాగే సన్నివేశాలతో దీనిని సిద్ధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని