OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
వెండితెరపై మెరిసిన బీ టౌన్(Bollywood) స్టార్స్ వెబ్‌సిరీస్‌ల్లో కనిపించడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఓటీటీల్లోకి అరంగేట్రం చేసి డిజిటల్ ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్‌లకు అంతే క్రేజ్ ఉంది. అందుకే వెండితెరకు వన్నెలద్దిన ముద్దుగుమ్మలు, బిగ్ స్క్రీన్‌పై హీరోయిజం చూపించిన స్టార్ హీరోలు కూడా ఓటీటీ వేదికగా వారి ఉనికిని చాటుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ బాట పట్టగా తాజాగా ఈ ఏడాది(2023) మరికొందరు ఈ డిజిటల్ దారిన(ott debut) నడవడానికి సిద్ధమయ్యారు. వారెవరో తెలుసుకుందామా మరి..
కరీనా కపూర్:
అందమైన ప్రేమకథతో ఓటీటీలోకి అరంగేట్రం చేయనుంది స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor). ‘లాల్ సింగ్ చద్దా’(Laal Singh Chaddha) అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ సారి ఎలాగైనా తన సత్తా చాటాలని నిర్ణయించుకుందీ అమ్మడు. సుజయ్ ఘోష్(Sujoy Ghosh) దర్శకత్వంలో ‘ది డివోషనల్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’(The Devotion of Suspect X) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఓ నవల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఓటీటీలో విడుదల చేయనున్న ఈ వెబ్ సిరీస్‌లో పలువురు అగ్ర స్థాయి నటీనటులు కీలకపాత్రలు పోషించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ రానుంది.
ఆదిత్యరాయ్ కపూర్
ఓ ప్రముఖ ఇంగ్లీష్ సిరీస్ రీమేక్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు ఆదిత్య కపూర్(Aditya Roy Kapur). గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ‘ది నైట్ మేనేజర్’(The Night Manager)ను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఇక ఈ సిరీస్‌లో అనిల్ కపూర్(Anil Kapoor), శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. హాలీవుడ్‌లో టామ్ హిడిల్‌స్టన్(Tom Hiddleston) ఈ సిరీస్‌తో సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. మరి ఆ పాత్రలో ఆదిత్యరాయ్ కపూర్‌ను చూడడానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సుసనా బేర్(Sussana Bier) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హాట్‌స్టార్ వేదికగా అలరించనుంది.
కాజోల్:
తన అందంతో వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజోల్(Kajol) ఇప్పుడు డిజిటల్ తెరపై మెరవడానికి రెడీ అయిపోయింది. అమెరికన్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ది గుడ్ వైఫ్’(The Good Wife) సిరీస్‌ను స్ఫూర్తిగా తీసుకుని అదే పేరుతో బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌కు సుపర్ణ వర్మ (Suparn Verma) దర్శకత్వం వహిస్తుండగా కాజోల్ ప్రధాన పాత్ర పోషించనుంది. డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఈ సిరీస్ విడుదలవ్వనుంది.
ఊర్మిళ:
ఇప్పటికే బాలీవుడ్ స్టార్‌లు మాధురీ దీక్షిత్(Madhuri Dixit) నుంచి సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) వరకు చాలా మంది ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారి సరసన చేరనుంది మరో స్టార్ హీరోయిన్ ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar). ‘తివారీ’(Tiwari) పేరుతో నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్ తల్లీ-కూతుళ్ల చుట్టూ తిరుగుతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ప్రేక్షకులను ఊర్మిళ ఆకర్షించింది.
సిద్ధార్థ్ మల్హోత్ర:
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర(Sidharth Malhotra) ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’(Indian Police Force)గా ఓ సిరీస్‌తో ఓటీటీలోకి రానున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఎనిమిది భాగాలుగా ఈ కాప్ డ్రామా తెరకెక్కనుంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ సిరీస్‌లో వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi), శిల్పా శెట్టి(Shilpa Shetty) ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్ హిట్‌పై ఇప్పటికే కచ్చితమైన నమ్మకంతో ఉన్న రోహిత్ శెట్టి దీనితో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తారనే ధీమాతో ఉన్నారు.
వరుణ్ ధావన్:
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత(Samantha)తో కలిసి ఓటీటీ ఎంట్రీకి రిబ్బన్ కట్ చేశాడు వరుణ్ ధావన్(Varun Dhawan). ‘సిటాడెల్’(Citadel) పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇద్దరూ అగ్ర తారలే అవ్వడంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నెటిజన్లు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో విజయాన్ని అందుకున్న రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇందులో సమంత లుక్‌ను విడుదల చేయగా నెటిజన్లు ఫిదా అయ్యారు. హాలీవుడ్ షో ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. ఇందులో వరుణ్ ధావన్, సమంత గూఢచారి పాత్రల్లో కనిపించనున్నారు. డిజిటల్ ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోనాక్షి సిన్హా:
యాక్షన్ థ్రిల్లర్‌తో ఓటీటీలోకి అరంగేట్రం చేయనుంది స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha). ‘దహాద్’(Dahaad) అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో విజయ్ వర్మ(Vijay Varma), సోహమ్ షా(Sohum Shah)లతో కలిసి నటిస్తోంది. ఇందులో సోనాక్షి పోలీసు పాత్రలో కనిపించనుంది. ‘దబాంగ్’తో సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఈ అందాల తార ఇటీవల ‘డబుల్ ఎక్స్‌ఎల్’ లో కనిపించింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో తన ఆశలన్నీ ఓటీటీపైనే పెట్టుకుందీ అమ్మడు.
అనన్య పాండే:
తన లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే హీరోయిన్ అనన్య పాండే(Ananya Panday). ఈ భామ ఓటీటీలో తన ఉనికిని చాటుకోడానికి రెడీ అయింది. ‘కాల్ మీ బే’(Call Me Bae) సిరీస్‌తో డిజిటల్ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వరుణ్ సూద్(Varun Sood) సరసన అనన్య నటిస్తోన్న ఈ సిరీస్‌ను కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్లు సమాచారం. నలుగురు పురుషుల సరసన ఆమె బిలియనీర్ ఫ్యాషన్ స్టార్ పాత్రను పోషించనుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ విడుదలవ్వనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’
-
Movies News
Rana: రానా.. చిన్నప్పటి ఇంటిని చూశారా..!
-
Sports News
Virender Sehwag: అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్