bootcut balaraju ott: ఓటీటీలో ‘బూట్‌కట్‌ బాలరాజు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

bootcut balaraju ott: సొహైల్‌, మేఘలేఖ కీలక పాత్రల్లో నటించిన ‘బూట్‌కట్‌ బాలరాజు’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Updated : 23 Feb 2024 14:21 IST

హైదరాబాద్‌: సొహెల్‌ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన సినిమా ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju). మేఘ లేఖ కథానాయిక. సునీల్‌, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. విడుదలై నెలరోజులు కూడా కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. తెలుగులో ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ‘‘మన ‘బూట్ కట్ బాలరాజు’ ఇక ఊరు, వాడ, పిల్లా, జల్లా అందరూ రెడీగా ఉండుర్రి’’ అని ట్వీట్ చేసింది.

ఇంతకీ కథేంటంటే: బాలరాజు (సొహైల్‌) ఊళ్లో సరదాగా తిరిగే కుర్రాడు. బాధ్యతలు అస్సలు తెలియవు. తండ్రి (సుమన్)కి ఇచ్చిన మాట కోసం పటేలమ్మ (ఇంద్రజ) తన భర్తను కూడా వదిలేసి ఊరి పెద్దగా మారుతుంది. ఆమె కూతురు మహాలక్ష్మి (మేఘలేఖ) అంటే ఊళ్లో అందరికీ గౌరవం, భయం. దీంతో ఎవరూ ఆమెతో స్నేహం చేసేవారు కాదు. అలాంటి సమయంలో బాలరాజు .. మహాలక్ష్మిని అందరితో సమానంగా చూస్తాడు. అలా వీరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారుతుంది. మరి వీరి ప్రేమకు ఉన్న అడ్డంకి ఏంటి? ఈ క్రమంలో బాలరాజుకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమను గెలిపించుకునేందుకు ఊరి ప్రజల మనసును ఎలా దోచుకున్నాడు? అన్నది మిగిలిన కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు