Boyapati RAPO: టైటిల్‌ గ్లింప్స్‌తో రామ్‌

రామ్‌ - బోయపాటి శ్రీను కలయికలో ఓ యాక్షన్‌ చిత్రం ముస్తాబవుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 02 Jul 2023 10:30 IST

రామ్‌ - బోయపాటి శ్రీను కలయికలో ఓ యాక్షన్‌ చిత్రం ముస్తాబవుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 3న టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రామ్‌ సరికొత్త మాస్‌ లుక్‌తో సందడి చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సంతోష్‌ డిటాకే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని