BoyapatiRAPO: పట్టరపట్టు... రంకెలు బెట్టు

కొట్టర కొట్టు నరాలు కట్టు.. బొక్కలు చూరా అయ్యేటట్టూ... అంటూ సందడి షురూ చేశాడు రామ్‌ పోతినేని.

Updated : 16 May 2023 11:56 IST

కొట్టర కొట్టు నరాలు కట్టు.. బొక్కలు చూరా అయ్యేటట్టూ... అంటూ సందడి షురూ చేశాడు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీలీల కథానాయిక. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సౌత్‌తో కలిసి పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. రామ్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఫస్ట్‌ థండర్‌ పేరుతో ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రామ్‌ మాస్‌ అవతారంలో సందడి చేశారు. ‘నీ స్టేట్‌ దాటలేనన్నావ్‌ దాటా... నీ గేటు దాటలేనన్నావ్‌ దాటా... నీ పవర్‌ దాటలేనన్నావ్‌ దాటా...’ అంటూ ఆయన చెప్పిన సంభాషణ మాస్‌ని మెప్పిస్తోంది. పట్టరపట్టు... రంకెలు బెట్టు అంటూ సాగే  పాట కూడా ఈ ప్రచార చిత్రంలో వినిపించింది. కాసర్ల శ్యామ్‌ ఈ పాట రాశారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. మాస్‌కి పెట్టింది పేరైన బోయపాటి శ్రీను మార్క్‌ సన్నివేశాలు ప్రచార చిత్రానికి  ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్‌ 20న దక్షిణాది భాషలతోపాటు, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని