Jr NTR: చంద్రబాబుకు విషెస్‌ చెప్పిన ఎన్టీఆర్‌.. మావయ్యకు శుభాకాంక్షలంటూ పోస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్‌ విషెస్‌ చెప్పారు

Updated : 05 Jun 2024 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చంద్రబాబు (Chandrababu), పవన్‌కల్యాణ్‌లకు (Pawan Kalyan) జూనియర్‌ ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లను అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ పోస్ట్ పెట్టారు.

  • ‘‘చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మావయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారాలోకేశ్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్‌కి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్‌ కల్యాణ్‌గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు - ఎన్టీఆర్‌
  • ‘‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. వరుసగా మూడోసారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారాలోకేష్‌, శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు.’’ - నందమూరి కల్యాణ్‌రామ్‌
  • ‘‘చారిత్రక విజయం సాధించిన ప్రియమైన పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఈ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి మై ఫ్రెండ్‌. ఇదే ఉత్సాహంతో ఉన్నతస్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా. కష్టపడేతత్వం, మనోబలం, నిబద్ధతతో స్ఫూర్తిని నింపుతూ ప్రజలకు మరింత సేవ చేస్తావని ఆశిస్తున్నా. పిఠాపురం ఎమ్మెల్యేగారికి మరోసారి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’ - సినీ నటుడు వెంకటేశ్‌
  • ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా - నాగార్జున
  • దార్శనికుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారు -రామ్‌చరణ్‌ 
  • ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి సభ్యులందరికీ విజయాభినందనలు. చంద్రబాబు,  పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌లకు ప్రత్యేక అభినందనలు - పరుచూరి గోపాలకృష్ణ
  • చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో దిగిన ఫొటోను గాయని స్మిత షేర్‌ చేసి విషెస్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని