Tillu Square: ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రబృందాన్ని అభినందించిన చిరంజీవి

సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాన్ని చిరంజీవి అభినందించారు.

Updated : 01 Apr 2024 16:55 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్‌’తో(Tillu Square) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్‌ చిత్రం ‘డీజే టిల్లు’కు ఇది సీక్వెల్‌. మల్లిక్‌రామ్‌ తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. మార్చి 29న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. అగ్ర కథానాయకుడు చిరంజీవి, నానీ చిత్రబృందాన్ని అభినందించారు.

‘‘సిద్ధు అంటే మా కుటుంబసభ్యులకు ప్రత్యేకమైన అభిమానం. ‘డీజే టిల్లు’ నాకెంతో నచ్చిన చిత్రం. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ను ఎంజాయ్‌ చేస్తూ చూశాను. యూత్‌ సినిమా అంటున్నారు. కానీ.. యూనివర్సల్‌ మూవీ ఇది. ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా. ఈ చిత్రం కోసం టీమ్‌ ఎంతో కష్టపడింది. దర్శకుడు మల్లిక్‌ చాలా బాగా రూపొందించారు. సిద్ధు కథ రాయడంతోపాటు అద్భుతంగా నటించాడు. సినిమా మంచి విజయం సాధించింది. చిత్రబృందానికి అభినందనలు’’ అని చిరంజీవి అన్నారు. ‘‘టిల్లు స్క్వేర్‌ వినోదాత్మక చిత్రం. టిల్లుగా సిద్ధు సినిమాను చివరి వరకూ నడిపించాడు. చాలా మంచి సినిమా. చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అని హీరో నానీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని