Chiranjeevi: ‘జవాన్‌’ పాటకు చిరంజీవి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Eenadu icon
By Entertainment Team Published : 14 Nov 2023 20:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi) ‘జవాన్‌’ (షారుక్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కింది) (Jawan) టైటిల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి అలరించారు. తనదైన శైలి స్టెప్పులతో వావ్‌ అనిపించారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘బాసూ.. అదిరింది గ్రేసు’ అంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డ్యాన్స్‌ ఎక్కడ చేశారంటే?.. దీపావళిని పురస్కరించుకుని శనివారం రాత్రి చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌ పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్‌ రాజకుమారి ‘జవాన్’ పాటను ఆలపిస్తుండగా చిరంజీవి డ్యాన్స్‌ చేశారు. విజువల్స్‌ తాజాగా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో రామ్‌ చరణ్‌ (Ram Charan) తన తండ్రిని ఎంకరేజ్‌ చేస్తూ కనిపిస్తారు.

చిరు, నాగ్‌, వెంకీ ఒకే ఫ్రేమ్‌లో

తమ కుమార్తె క్లీంకారకు తొలి దీపావళి కావడంతో రామ్‌ చరణ్‌ దంపతులు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులు సతీసమేతంగా ఆ పార్టీకు హాజరై సందడి చేశారు. ఆ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇంకెందుకు ఆలస్యం చిరు డ్యాన్స్‌ను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని