Chiranjeevi: ‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?

‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. 

Updated : 18 Apr 2024 15:28 IST

హైదరాబాద్‌: నటుడు ‘మహర్షి’ రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. ఆయన గొప్ప మనసును మెచ్చుకున్నారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రేరణగా తీసుకోవాలని కోరారు. 

‘‘మహర్షి రాఘవ వందసార్లు మా బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఒక వ్యక్తి అన్నిసార్లు రక్తం ఇవ్వడం ఇదే ప్రప్రథమం. ఈ సందర్భంగా ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించి సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. నిజంగా ఆయన చాలా గ్రేట్‌. మేం బ్లడ్‌బ్యాంక్‌ స్థాపించినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్‌. అదే రోజు కార్యక్రమంలో పాల్గొన్న రాఘవ.. నాటి నుంచి ఇప్పటివరకూ ఆదర్శ రక్తదాతగా నిలిచారు. ఆయన చేస్తున్న ఈ పని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి సమయానికి రక్తం అందుతుంది’’ అని మెచ్చుకున్నారు. మురళీ మోహన్‌ సైతం రాఘవను ప్రశంసించారు.

సినిమాల విషయానికి వస్తే.. ‘భోళాశంకర్‌’ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకుడు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. త్రిష కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల చిరంజీవి-త్రిషలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. భారీ బడ్జెట్‌తో ఇది సిద్ధమవుతున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని