Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశిష్ట అతిథిగా చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకానున్నారు.

Updated : 11 Jun 2024 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)  బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి అగ్రకథానాయకుడు చిరంజీవి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరుకావాలని కోరుతూ చిరంజీవికి (Chiranjeevi) ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ నుంచి రేపు ఉదయం జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. రామ్‌ చరణ్‌ (Ram Charan) కూడా హాజరుకానున్నారు.

మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సీఎంగా బాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ జనసేనకు చిరంజీవి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కూడా ఎన్నికల ఫలితాల అనంతరం చిరంజీవి నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు