Chiranjeevi: భజే భజే

నాన్న కోసం ఓ యువకుడు ఏం చేశాడో తెలియాలంటే ‘భజే వాయు వేగం’ చూడాల్సిందే. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 21 Apr 2024 13:30 IST

నాన్న కోసం ఓ యువకుడు ఏం చేశాడో తెలియాలంటే ‘భజే వాయు వేగం’ చూడాల్సిందే. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు. యు.వి.కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ని అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘విశ్వంభర’ సెట్‌లో విడుదల చేశారు. ‘‘ప్రతి ఒక్కడి జీవితంలో ఒకరు ఉంటారు. వారి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం. నా లైఫ్‌లో అది మా నాన్న’’ అంటూ కార్తికేయ చెప్పే సంభాషణ టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది. డ్రగ్స్‌ కేసులో నిందితుడు, ఆ కేసుని పరిశోధిస్తున్న ఆఫీసర్‌ హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు సాగించే వేట నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు టీజర్‌ స్పష్టం చేస్తోంది. టీజర్‌ విడుదల అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘నా అభిమాని, నా తమ్ముడులాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ప్రశాంత్‌ రెడ్డి కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీస్తున్నాడు. ఇలాంటి యువ దర్శకులు ఎంత కొత్త కాన్సెప్ట్స్‌తో వస్తే సినిమా పరిశ్రమ అంత కొత్తగా ముందుకు సాగుతుంది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని