Bharat Ratna: తెలుగు వారందరికీ గర్వకారణం: చిరంజీవి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ ప్రకటించడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published : 09 Feb 2024 16:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)కు భారతరత్న ప్రకటించడంపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇది తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణమంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అలాగే, చరణ్‌ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (MS Swaminathan)కు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామినాథన్ రైతుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. 

  • పీవీ నరసింహారావు నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు. విప్లవ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ఆర్థికశక్తిగా మార్చడానికి పునాది వేసిన వ్యక్తి. ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించడం భారతీయులందరికీ, తెలుగువారికి మరింత సంతోషకరమైన విషయం. ఈ పురస్కారం చాలా ఆలస్యంగా దక్కింది. కానీ, ఇంతకుమించిన గౌరవం ఏముంటుంది. - అగ్ర కథానాయకుడు చిరంజీవి 
  • పీవీ నరసింహారావు గొప్ప వ్యక్తి. మా అమ్మ చిన్నప్పుడు ఆయన పొరిగింట్లోనే ఉండేవారు. - నటుడు అడివి శేష్ 
  • దిగ్గజ రచయిత, నాయకుడు, నిజమైన రాజనీతిజ్ఞుడికి ఒక చిరస్మరణీయ నివాళి. పీవీ నరసింహారావు ఎంతోమందికి స్ఫూర్తి -  దర్శకుడు సంపత్‌ నంది
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని