Chiranjeevi: శ్రీకాంత్‌ ఇంట చిరంజీవి సందడి.. వీడియో వైరల్‌

నటుడు శ్రీకాంత్‌ (Srikanth) నివాసంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సందడి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 24 Mar 2024 11:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi), నటుడు శ్రీకాంత్‌ (Srikanth) మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ ‘శంకర్‌ దాదా ఎం.బి.బి.ఎస్‌’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ చిత్రాల కోసం కలిసి వర్క్‌ చేశారు. శ్రీకాంత్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని శనివారం చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కేక్‌ కట్‌ చేయిచారు. అనంతరం, కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీకాంత్‌ నివాసంలో ఉన్న పలు ఫొటోలు, అవార్డులు చూసి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘మీ కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

‘భోళా శంకర్‌’ తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకుడు. త్రిష కథానాయిక. ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో భీమవరం దొరబాబుగా చిరు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, సాంగ్‌ షూట్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘దేవర’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని