NTR30: ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌గా స్టార్‌ హీరో..!

కొరటాల శివ (Koratala Siva), జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) కాంబినేషన్‌లో ఓ సినిమా(#NTR) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని విలన్‌ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Updated : 09 Feb 2023 17:08 IST

హైదరాబాద్‌:  ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన ఎన్టీఆర్‌ మాస్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఎన్టీఆర్‌30గా (#NTR30) రూపొందుతోన్న ఈ సినిమా మార్చి30 నుంచి సైట్స్‌ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో విలన్ పాత్ర కోసం మేకర్స్‌ స్టార్‌ హీరోల పేర్లు పరిశీలిస్తున్నారట.

ఇటు టాలీవుడ్‌ లోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ మంచి ప్రేక్షకాదరణ పొందిన నటులు ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌ పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ ‌(Vikram), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), సైఫ్‌ అలీఖాన్ ‌(Saif Ali Khan)లతో చిత్రబృందం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వీళ్లలో ఒకరు ఎన్టీఆర్‌ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించే అవకాశం ఉందని జోరుగా ప్రచారమవుతోంది.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ సరసన ఎవరు నటించనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఈ సినిమాతో జాన్వీకపూర్‌ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు, ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయనున్నాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని