Thangalaan: తంగలాన్‌... ఓ అద్భుత ప్రయాణం

సినిమాలలో భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు ప్రముఖ కథానాయకుడు విక్రమ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’.

Updated : 06 Jul 2023 14:07 IST

సినిమాలలో భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు ప్రముఖ కథానాయకుడు విక్రమ్‌ (Vikram). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). పా రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ గెటప్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త తరహాలో ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాలో విక్రమ్‌కు సంబంధించిన చిత్రాలు విడుదలై ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెట్‌ నుంచి ఫొటోల్ని పంచుకున్నారు విక్రమ్‌. ‘‘తంగలాన్‌’ చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మంచి వ్యక్తులతో పనిచేశాను. ఒక నటుడిగా నాకు మంచి అనుభవాల్ని ఇచ్చింది. ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు’ అని వ్యాఖ్యల్ని జోడించారు. ఈ చిత్రంలో మాళవిక మోహన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్‌ బంగారు గని కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని