NTR: ఆగస్టు నుంచి ఆరంభం

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్‌ చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

Updated : 21 May 2024 01:20 IST

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్‌ చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రమే ‘ఎన్టీఆర్‌ నీల్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో ఆగస్టు నుంచి చిత్రీకరణను ప్రారంభించుకోనుంది. సోమవారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ప్రశాంత్‌ ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని.. ఎన్టీఆర్‌కు ఉన్న మాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ శక్తిమంతమైన కథను, పాత్రను సిద్ధం చేస్తున్నారని.. ఇది కచ్చితంగా సినీప్రియుల అంచనాల్ని మించేలా ఉండనుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర: పార్ట్‌ 1’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘వార్‌ 2’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని