లాక్‌డౌన్‌లో ఓ అమ్మాయి చేసిన పని ఇంటిల్లిపాదికి ప్రమాదమైతే.. భయపెడుతున్న ‘కనెక్ట్‌’

వివాహం తర్వాత నయన తార నటించిన సరికొత్త చిత్రం ‘కనెక్ట్‌’. లాక్‌డౌన్‌లో ఏం చేయాలో తెలియక ఓ అమ్మాయి స్పిరిట్‌ గేమ్‌ ఆడటం వల్ల ఆ కుటుంబం ఎదుర్కొన్న ప్రమాదం, దాని నుంచి ఎలా బయటపడింది అనే ఆసక్తికర అంశాలతో  హారర్‌ నేపథ్యంలో ఇది తెరకెక్కింది.

Updated : 09 Dec 2022 10:43 IST

హైదరాబాద్‌: అందమైన నగరం.. అందులో ఓ చిన్న కుటుంబం.. ఎలాంటి చింతలు లేకుండా సంతోషంగా సాగుతోన్న వారి జీవితాలు లాక్‌డౌన్‌ కారణంగా ఛిద్రమయ్యాయి. వైద్యుడైన తండ్రి కరోనా విధుల్లో భాగంగా ఆస్పత్రికే పరిమితం కావడం, తల్లి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో బిజీగా ఉండటంతో ఆ ఇంటి అమ్మాయి స్పిరిట్‌ గేమ్‌ ఆడి ఇంటిల్లిపాదిని ప్రమాదంలోకి నెట్టేసింది. ఇంతకీ ఆ అమ్మాయి స్పిరిట్‌ గేమ్‌ ఎందుకు ఆడింది? ఆ అమ్మాయి ఒంట్లోకి ప్రవేశించిన ఆత్మను బయటకు పంపించేందుకు ఇంట్లోవాళ్లు ఏం చేశారు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘కనెక్ట్‌’ (Connect).

వివాహం తర్వాత నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. సత్యరాజ్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ వారు తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. తల్లిగా నయన్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ఆత్మలతో మాట్లాడాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిగా నాఫియా అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ నెట్టింట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్‌లో వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్లను తలపించేలా ‘కనెక్ట్‌’ (Connect Trailer) ట్రైలర్‌ ఉందని కామెంట్స్‌ పెడుతున్నారు. డిసెంబర్‌ 22న ఇది విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని