Akhanda: బాలకృష్ణ లుక్స్‌.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్‌

‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్‌ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్‌ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్‌ రాజా’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Published : 29 Mar 2024 00:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అఖండ 2’ (Akhanda 2)లో హీరో బాలకృష్ణ లుక్స్‌ ‘అఖండ’ (Akhanda)కు మించి ఉండబోతున్నాయంటూ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, యాక్టర్‌ రామ్స్‌ (Raamz) సినీ ప్రియుల్లో అంచనాలు పెంచారు. రెండు వారాల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను ఫోన్‌ చేసి ఈ విషయమై చర్చించారని తెలిపారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్‌ రాజా’ (Fighter Raja) సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఇకపై నటుడిగా కొనసాగుతారా? కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ కూడా పని చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘అఖండ’లోని బాలకృష్ణ సర్‌ లుక్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేను, బోయపాటి శ్రీను కలిసి వాటిని రూపొందించాం. ఇప్పుడు ‘అఖండ 2’కు పనిచేస్తున్నా. నటిస్తూనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కొనసాగుతా’’ అని చెప్పారు. ఈ ఈవెంట్‌కు హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు. రామ్స్‌తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.

2021 డిసెంబరులో విడుదలైన ‘అఖండ’ బాక్సాఫీసు వద్ద  ఘన విజయం అందుకుంది. ‘అఖండ 2’ ఆలోచన ఉందని బోయపాటి శ్రీను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కృష్ణ ప్రసాద్‌ తెరకెక్కించిన ‘ఫైటర్‌ రాజా’లో ‘విక్రమ్‌’, ‘లియో’ ఫేమ్‌ మాయా ఎస్‌. కృష్ణన్‌ మరో ప్రధాన పాత్ర పోషించారు. తనికెళ్ల భరణి, నందు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని