Adipurush: ‘ఆదిపురుష్‌’పై సెహ్వాగ్‌ సెటైర్‌.. ‘బాహుబలి’ని ఉద్దేశిస్తూ ట్వీట్‌

‘ఆదిపురుష్‌’(Adipurush)పై విమర్శలు చేసేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ సినిమాని వ్యతిరేకించగా.. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 

Published : 25 Jun 2023 13:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరాడు మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag). ‘‘ఆదిపురుష్‌’ చూసిన తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అర్థమైంది’’ అంటూ ఆయన సెటైర్‌ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. సినిమా చూడకుండానే సెహ్వాగ్‌ ఈ ట్వీట్‌ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓంరౌత్‌ (Om Raut) ‘ఆదిపురుష్‌’ను తెరకెక్కించారు. రాఘవ పాత్రలో ప్రభాస్‌ (Prabhas).. జానకి పాత్రలో కృతిసనన్‌ (Kriti Sanon) నటించారు. రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించారు. భారీ అంచనాల మధ్య జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్‌ విషయంలో అంతటా వివాదం నెలకొంది. ఓంరౌత్‌, మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా, చిత్ర నిర్మాతలకు రామాయణంపై సరైన అవగాహన లేదని, ఈ సినిమానే దానికి నిదర్శనం అంటూ పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే చిత్రబృందం హనుమంతుడి డైలాగ్స్‌లో మార్పులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని