Skanda: టన్నుల గుండెలు మెల్ట్‌ చేసే మామా!

‘‘రామ్‌ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక.

Updated : 20 Sep 2023 13:52 IST

‘‘రామ్‌ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్కంద’. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. శ్రీలీల కథానాయిక. ఊర్వశీ రౌతేలా ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘‘కల్ట్‌ మామా.. కల్టు.. నువ్వు కన్నుకొడితే అంతే మామా.. టన్నుల గుండెలు మెల్టు’’ అంటూ సాగుతున్న ఈ గీతాన్ని రామ్‌ - ఊర్వశీలపై చిత్రీకరించారు. దీనికి తమన్‌ స్వరాలు సమకూర్చగా.. అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించారు. హేమచంద్ర, రమ్య బెహర, మహా సంయుక్తంగా ఆలపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని