Abhiram: దగ్గుబాటి వారి పెళ్లి సందడి

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు రెండో తనయుడు, హీరో అభిరామ్‌ ఓ ఇంటివాడయ్యారు.

Updated : 08 Dec 2023 09:37 IST

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు రెండో తనయుడు, హీరో అభిరామ్‌ ఓ ఇంటివాడయ్యారు. తమ బంధువుల అమ్మాయి ప్రత్యూషను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఈ వివాహ వేడుక బుధవారం రాత్రి శ్రీలంకలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. వధూవరుల కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక సాగింది. దగ్గుబాటి ఫ్యామిలీ త్వరలో ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో వివాహ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అభిరామ్‌ ఇటీవలే తేజ తెరకెక్కించిన ‘అహింస’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని