Dasari Sahithi: ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..

‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 

Published : 25 Apr 2024 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే ఎన్నికల బరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు పోటీపడుతుండగా తాజాగా ఆ లిస్ట్‌లో మరో నటి చేరారు. ‘పొలిమేర’ సిరీస్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి (Dasari sahithi) ఎన్నికల బరిలో పోటీపడనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్‌ సమర్పించారు.

‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాల్లో సాహితి తన నటనతో ఆకట్టుకున్నారు. మొదటిభాగంలో గెటప్‌ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్‌లో రాజేశ్‌తో కలిసి నటించారు. ఇటీవల తన ఇన్‌స్టా వేదికగా రాజకీయాల గురించి సాహితి స్పందించారు. తాను పవన్‌కల్యాణ్ అభిమానినని చెప్పిన ఆమె.. ఇన్‌స్టాలో తాను రీల్స్‌ చేసే పాటలకు పొలిటికల్‌ విషయాలను ఆపాదించొద్దని కోరారు. చేవేళ్ల నుంచి భాజపా తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి పోటీ చేస్తుండగా, భారాస నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ బరిలో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని