NTR: తీరానికి ‘దేవర’

సముద్ర తీరాలన్నీ తనవే అంటున్నాడు దేవర. మరో తీరంలో సందడికి సన్నద్ధమయ్యాడు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’.

Updated : 23 Oct 2023 14:00 IST

సముద్ర తీరాలన్నీ తనవే అంటున్నాడు దేవర. మరో తీరంలో సందడికి సన్నద్ధమయ్యాడు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్‌ కథానాయిక. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సమర్పిస్తోంది. త్వరలో గోవాలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఇప్పటికే చిత్రబృందం అక్కడికి చేరుకుంది. పండగ తర్వాత అక్కడ కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భైర పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు సైఫ్‌ అలీఖాన్‌. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని