Dhakshina: ఆ హత్యల వెనక ఒక్కడు?

ఒక్క ఆధారం కూడా దొరక్కుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే ‘దక్షిణ’ చూడాల్సిందే. ‘మంత్రం’, ‘మంగళ’ చిత్రాల ఫేం ఓషో తులసీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 16 May 2024 09:36 IST

క్క ఆధారం కూడా దొరక్కుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే ‘దక్షిణ’ చూడాల్సిందే. ‘మంత్రం’, ‘మంగళ’ చిత్రాల ఫేం ఓషో తులసీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ‘కబాలి’ ఫేం సాయి ధన్సిక కథానాయిక. రిషవ్‌ బసు ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. అశోక్‌ షిండే నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ని  దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు. ‘‘ఒక నార్మల్‌ పర్సన్‌ ఆవేశంలో చేసే మర్డర్‌కీ... ఒక సైకో ఆనందం కోసం చేసే మర్డర్‌కీ ఇలాగే తేడా ఉంటుంది...’’ అనే సంభాషణలతో కూడిన సన్నివేశాలు, విజువల్స్‌ ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్‌ విడుదల అనంతరం బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘ఈమధ్య కాలంలో నన్ను భయపెట్టిన ట్రైలర్‌ ఇదే. దర్శకుడు తులసీరామ్‌ టాలీవుడ్‌కి మరో ట్రెండ్‌ సెట్టర్‌ సైకో థ్రిల్లర్‌ సినిమాని అందిస్తున్నార’’ని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని