Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్‌

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది.

Published : 20 Mar 2024 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే. ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాతేశ్వరన్‌ తెరకెక్కించనున్నారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో బుధవారం నుంచి చిత్రీకరణ మొదలైంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌నూ చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ధనుష్‌, కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘నీ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఎప్పుడూ చెబుతుంటా. చాలామంది ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఇళయరాజా పాటలు వింటుంటారు. కానీ, నేను.. ఆయన బయోపిక్‌లో ఎలాగైనా నటించాలని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపా. రజనీకాంత్‌, ఇళయరాజా అంటే నాకెంతో ఇష్టం. వాళ్లిద్దరి బయోపిక్స్‌లో నటించాలని కోరుకున్నా. అందులో ఓ కల ఇప్పుడు నెరవేరింది. అందుకు గర్వపడుతున్నా. ఇళయరాజాకు నేనొక భక్తుడిని. యాక్టింగ్‌లో నాకు గురువు ఆయన సంగీతం. ప్రతీ సీన్‌కు ముందు ఆయన మ్యూజిక్‌ వింటుంటా. ఎలా నటించాలో అదే నాకు నేర్పిస్తుంది’’ అని ధనుష్‌ చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దీనిని అద్భుతంగా తీర్చిదిద్దాలని కమల్‌హాసన్‌ కోరారు.

ఇళయరాజా సంగీత దర్శకుడిగా మారడానికి ముందు ఆయన జీవిత చరిత్రకు అద్దంపట్టేలా ఈ చిత్రం ఉంటుందని కోలివుడ్‌ వర్గాల సమాచారం. ఇళయరాజానే దీనికి సంగీత దర్శకుడిగా వ్యవహరించవచ్చని టాక్‌. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని