Dil Raju: అలాంటి సినిమా చేయాలని ఉంది..: డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై దిల్‌ రాజు

‘గేమ్‌ ఛేంజర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘లవ్‌ మీ’ ఇలా వరుస సినిమా ప్రమోషన్లతో బిజీగా మారిన నిర్మాత దిల్‌రాజు (Dil Raju).. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడారు.

Published : 31 Mar 2024 11:17 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరోలతో వరుస చిత్రాలు నిర్మిస్తోన్న నిర్మాత దిల్‌రాజు (Dil Raju).. తాజాగా ఓ ఈవెంట్‌లో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడారు. ‘‘హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఇటీవల ‘దిల్‌రాజు ప్రొడక్షన్‌ హౌస్‌’ మొదలుపెట్టారు. కొత్త దర్శకులతో భిన్నమైన చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఆసక్తి రేకెత్తించే కథలు ఉంటే వాళ్లూ స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తారు. నిర్మాతగా నా ప్రయాణం మొదలై 21 ఏళ్లు అవుతోంది. రానున్న నాలుగేళ్లలో భారీ పాన్‌ ఇండియా మూవీ చేయాలని ఉంది. అందుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టాం’’

‘‘ఆర్య’ విడుదలై మే 7వ తేదీతో 20 ఏళ్లు అవుతోంది. ఆరోజు రీ యూనియన్‌ ప్లాన్‌ చేయాలనుకుంటున్నాం. ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ దాదాపు ఖరారైంది. శంకర్‌ చెప్పిన వెంటనే మేము అనౌన్స్‌ చేస్తాం. ఐదు భాషల్లో విడుదల చేయనున్నాం. ‘టిల్లు స్క్వేర్‌’ డిస్ట్రిబ్యూటర్‌గా మేము విజయాన్ని అందుకున్నాం. ఏప్రిల్‌ 5న ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల కానుంది. ఆ తర్వాత ‘లవ్‌ మీ’ విడుదల కానుంది. ఈ వేసవి మనదే’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని