Vijay Deverakonda: 21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్‌’ రిలీజ్‌పై దిల్‌రాజు

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) పరశురామ్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

Published : 28 Mar 2024 14:44 IST

హైదరాబాద్‌: ‘ఫ్యామిలీ స్టార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో చిత్ర దర్శకుడు పరశురామ్‌, నిర్మాత దిల్‌రాజు సందడి చేశారు. నగరంలోని శ్రీరాములు థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ అభిమానులతో కలిసి ట్రైలర్‌ వీక్షించారు. అనంతరం చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు పరశురామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదలయ్యాక.. ఈ చిత్రాన్ని, ఇందులోని నటీనటులను తెలుగు ప్రేక్షకులు కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకుంటారు’’ అని అన్నారు.

అనంతరం దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘గీత గోవిందం’ కాంబోలో వస్తోన్న చిత్రమిది. ఆ స్థాయిలో వినోదం ఉండనుంది. ఫైట్స్‌, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లే ప్రతీ మనిషి ఫ్యామిలీ స్టారే. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్‌లా మారతారు. నన్ను దిల్‌రాజుగా మార్చిన ‘దిల్‌’ సినిమా ఏప్రిల్‌ ఐదో తేదీనే విడుదలైంది. దాదాపు 21 ఏళ్ల తర్వాత అదే డేట్‌లో ఈ సినిమా రానుంది. యూనివర్సల్‌ కంటెంట్‌తో వస్తోన్న చిత్రమిది. తప్పకుండా అందరూ ఎంటర్‌టైన్‌ అవుతారు’’ అని అన్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ట్రైలర్‌ రిలీజ్‌ సెలబ్రేషన్స్‌ చేయనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని