Raja Saab: అలా మొదలై.. ప్రభాస్‌తో సినిమా చేయడం అచీవ్‌మెంట్‌: దర్శకుడు మారుతి

‘ట్రూ లవర్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ‘రాజా సాబ్‌’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు మారుతి. ప్రభాస్‌తో సినిమా చేయడం అచీవ్‌మెంట్‌ అని అన్నారు.

Published : 04 Feb 2024 21:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర హీరో ప్రభాస్‌ (Prabhas)తో తాను సినిమా చేయడం అచీవ్‌మెంట్‌ అని దర్శకుడు మారుతి (Maruthi) పేర్కొన్నారు. కెరీర్‌ ప్రారంభమైన రోజుల్ని గుర్తుచేసుకుంటూ అలా వ్యాఖ్యానించారు. ‘ట్రూ లవర్‌’ (True Lover) సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘ట్రూ లవర్‌’ సినిమా.. నేను తెరకెక్కించిన ‘ఈ రోజుల్లో’ (Ee Rojullo) జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. తక్కువ బడ్జెట్‌తో నేను ఆ చిత్రాన్ని తెరకెక్కించా. తర్వాత ‘బస్‌స్టాప్‌’ తదితర సినిమాలు తీశా. అలా నెమ్మదిగా ప్రారంభమైన నా ప్రయాణం ఇప్పుడు ప్రభాస్‌గారి వరకు వచ్చింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. ‘రాజా సాబ్‌’ (Raja Saab) గురించి మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపిస్తా. ఈ చిత్రానికి సంబంధించి నెలకో అప్‌డేట్‌ ఉంటుందని ఇటీవల చెప్పాం. ఆ మేరకు ఏదో ఒకటి ఇస్తే ‘ఇది కూడా అప్‌డేటేనా?’ అని మళ్లీ మీరే అంటారు. అందుకే మంచి సర్‌ప్రైజ్‌ కోసం వేచి చూడండి. ప్రేమలో విఫలమైన అబ్బాయి బాధ ఎలా ఉంటుందో ‘ట్రూ లవర్‌’లో చూపించబోతున్నారు. దర్శకుడు ఆరేళ్లు కష్టపడి ఈ కథను రాశారట. ఇలాంటి మంచి కథలను అందించేందుకు నన్ను, నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ను సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ‘రాజా సాబ్‌’ విడుదలపై ఇలా స్పందించారు. ‘త్వరలోనే ప్రభాస్‌ నటించిన పెద్ద సినిమా రిలీజ్‌ కానుంది. దాని అప్‌డేట్స్‌ రావాలి. ఆ చిత్రం మంచి విజయం సాధించాలి. అందరూ కోరుకునే మంచి తేదీకే ‘రాజా సాబ్‌’ను రిలీజ్‌ చేస్తాం. నేను ప్రభాస్‌కు ట్రూ లవర్‌ని. ప్రస్తుతం ఆయన ప్రేమని ఎంజాయ్‌ చేస్తున్నా. ఆయనంటే నాకెంత ఇష్టమో సినిమాలోనూ కనిపిస్తుంది’ అని అన్నారు. మణికందన్‌, శ్రీగౌరి ప్రియ జంటగా దర్శకుడు ప్రభురామ్‌ వ్యాస్‌ తెరకెక్కించిన ‘ట్రూ లవర్‌’ ఈ నెల 9న తమిళంలో, 10న తెలుగులో విడుదల కానుంది. 9న ప్రీమియర్‌ షోస్‌ (తెలుగు) ప్రదర్శించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు