Sandeep Reddy Vanga: ఆ నలుగురు హీరోలతో ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’.. సందీప్‌ రెడ్డి ఏమన్నారంటే?

ఓ కార్యక్రమంలో సినిమాటిక్‌ యూనివర్స్‌పై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా స్పందించారు.

Published : 15 Apr 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’ (Animal) చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). చెన్నైలో జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరైన ఆయన ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ (Sandeep Reddy Vanga Cinematic Universe)పై స్పందించారు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor), రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), ప్రభాస్‌ (Prabhas).. ఈ నలుగురితో యూనివర్స్‌ ప్లాన్‌ చేసే అవకాశం ఉందా? అని హోస్ట్‌ ప్రశ్నించగా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదన్నారు. ఒకవేళ ఏదైనా మంచి పాయింట్‌ మదిలో మెదిలితే కచ్చితంగా చేస్తానని చెప్పారు. ‘యానిమల్‌’లోని హీరో పాత్రకు ఏ తమిళ నటుడు సూట్‌ అవుతారని అడగ్గా సూర్య (Suriya) అని తెలిపారు. ‘యానిమల్‌’ సీక్వెల్‌ని 2026లో ప్రారంభిస్తామన్నారు. 

కథ ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచి మళ్లీ మొదలయ్యేది కొనసాగింపు చిత్రమైతే, కథలతో సంబంధం లేకుండా ఆయా కథల ప్రపంచాన్నో, పాత్రల్నో కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందించడాన్ని సినిమాటిక్‌ యూనివర్స్‌గా పేర్కొంటారు. ఇండియన్‌ ఇండస్ట్రీలో కోలీవుడ్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ ఈ కాన్సెప్ట్‌కు నాంది పలికారు. టాలీవుడ్‌లోనూ అలాంటి ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. సందీప్‌ విషయంలో ఆ నలుగురు కథానాయకులని ప్రస్తావించడానికి కారణం.. వారిలో ముగ్గురితో (అర్జున్‌ రెడ్డి- విజయ్‌; కబీర్‌ సింగ్‌- షాహిద్‌; యానిమల్‌- రణ్‌బీర్‌) ఇప్పటికే ఆయన సినిమాలు తెరకెక్కించగా త్వరలోనే ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని రూపొందించనుండడం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని