Kalki: ప్రభాస్‌-దిశా పటానీ ఫొటో వైరల్‌.. రిలీజ్‌ డేట్‌పై స్పష్టతనివ్వాలని కోరుతోన్న ఫ్యాన్స్‌!

‘కల్కి’ సెట్‌లో దిగిన ఫొటోలను హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) షేర్‌ చేశారు.

Published : 05 Apr 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రస్తుతం దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) ఈ సినిమా సెట్‌లోని కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వాటిలో ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ కూడా ఉండడంతో సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని  షేర్ చేస్తోన్న ఫ్యాన్స్‌ ‘కల్కి’ రిలీజ్‌ డేట్‌పై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు. 

ఈ సినిమా విడుదలకు సంబంధించిన కొన్ని వార్తలు ప్రభాస్‌ అభిమానులను కలవరపెడుతున్నాయి. మే 9న ఇది విడుదల కానున్నట్లు గతంలో చిత్రబృందం పేర్కొంది. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. దీని రిలీజ్‌ డేట్‌పై చర్చలు జరుగుతున్నట్లు టాక్‌. మే 30కు వాయిదా వేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి. కానీ, అది ఎన్నికల సమయం కాబట్టి ఆ తేదీపై కూడా మూవీ యూనిట్‌ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో దీని విడుదలపై దర్శక, నిర్మాతలు మరోసారి స్పందిస్తే బాగుండని అభిమానులు అనుకుంటున్నారు. 

ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తోన్న ‘కల్కి’లో సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీన్ని ఆరువేల సంవత్సరాల మధ్య జరిగే కథతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్‌ ఓ సందర్భంలో తెలిపారు. గతం, భవిష్యత్తుతో ముడిపడిన స్టోరీ కాబట్టి అందుకు తగ్గట్టు సరికొత్త ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించినట్లు ఆయన చెప్పారు. అగ్ర తారలు నటిస్తుండడంతో పాటు స్టోరీలైన్‌ ఆసక్తిగా ఉండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని