Siddhu Jonnalagadda: సుకుమార్ నిర్మాణంలో మరో యువ హీరో సినిమా
‘డి.జె టిల్లు’ సినిమాతో యూత్‌లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). తన పుట్టిన రోజు సందర్భంగా ఈ యంగ్ హీరో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించాడు.
హైదరాబాద్: ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). ఆ చిత్రం విడుదలై నెలలు గడుస్తున్నా సోషల్‌మీడియాలో ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ యంగ్ హీరో తన పుట్టిన రోజు సందర్భంగా తన తర్వాత సినిమా (#siddu8)ను ప్రకటించాడు. ఈ సినిమాతో నూతన దర్శకురాలు వైష్ణవి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిపి తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘సిద్ధూతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. సినీప్రియులంతా సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం సిద్ధూ ‘డి.జె.టిల్లు’ సినిమా సీక్వెల్‌గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ (Tillu sqaure) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్‌తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!