Double ismart: ఇస్మార్ట్‌.. సన్నాహాలు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు కొనసాగింపుగా రామ్‌ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి కనెక్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

Updated : 26 Dec 2023 09:33 IST

స్మార్ట్‌ శంకర్‌’కు కొనసాగింపుగా రామ్‌ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి కనెక్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే ముంబయిలో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కాగా, ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అది జనవరి తొలి వారం నుంచి ముంబయిలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో రామ్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి మణిశర్మ సంగీతమందిస్తుండగా.. కేచ, రియల్‌ సతీశ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని