Srinivasa Murthy: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి కన్నుమూత

కోలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌హీరోలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పిన శ్రీనివాస మూర్తి (Srinivasa Murthy) కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 

Updated : 27 Jan 2023 16:11 IST

చెన్నై: ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి (Srinivasa Murthy) మృతి చెందారు. గుండెపోటుతో  చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో ఏళ్ల నుంచి సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు. సూర్య, అజిత్‌, మోహన్‌లాల్‌, కార్తి‌, విక్రమ్‌తోపాటు పలువురు స్టార్‌ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. సహాయనటుడిగానూ ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: సూర్య

శ్రీనివాస మూర్తి మృతి పట్ల సినీ హీరో సూర్య సంతాపం వ్యక్తంచేశారు. ‘‘శ్రీనివాసమూర్తి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. తెలుగులో నా నటనకు ఆయన గాత్రం, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. మిమ్మల్ని కోల్పోయాం సర్‌. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు’’ అంటూ ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని