Sri Ramakrishna: ప్రముఖ సినీ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు.

Updated : 02 Apr 2024 09:11 IST

చెన్నై:సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు తెలుగు డబ్బింగ్‌ చెప్పే గాయకుడు మనోను ఆయనకు పరిచయం చేసింది శ్రీరామకృష్ణే. 300 చిత్రాలకు పైగా డబ్బింగ్‌ రచయితగా పనిచేశారు. చివరిగా రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సినిమాకు డైలాగ్స్‌ రాశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు