Dulquer Salmaan: సినిమాల్లోకి రావడానికి చాలా భయపడ్డా: దుల్కర్‌ సల్మాన్‌

తన నటనతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). ఆయన ఆలస్యంగా సినిమాల్లోకి ఎందుకు వచ్చారో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Published : 24 Mar 2023 15:16 IST

హైదరాబాద్‌: ‘మహానటి’ (Mahanati), ‘సీతా రామం’ (Sita Ramam) సినిమాలతో తెలుగు వారికి బాగా చేరువయ్యారు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan). మమ్ముట్టి కుమారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి కొన్నిరోజులకే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది స్టార్‌ హీరోల కుమారులు 20 ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టినా.. దుల్కర్‌ మాత్రం 28 ఏళ్లకు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. తాను ఎందుకు ఆలస్యంగా రావాల్సి వచ్చిందో తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు. 

‘‘నేను ఈ రంగంలోకి రావడానికి మొదట చాలా భయపడ్డాను. అందుకే 28 ఏళ్లు వచ్చే వరకు ఆగాను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ నేను నటించగలనా.. థియేటర్లో ప్రేక్షకులు నన్ను రెండు గంటలు చూడగలరా అని అనుకున్నా. ఆ వయసులో మనపై మనకు పెద్దగా నమ్మకం ఉండదు. ఎంతో అభద్రతాభావానికి లోనవుతుంటాం. నా పరిస్థతి కూడా అదే. పైగా అప్పుడు మలయాళ చిత్రపరిశ్రమలో నెపోటిజం బాగా చర్చనీయాంశమైన విషయం. మా నాన్న ఈ రంగంలో లెజెండ్‌. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన పేరును నేను చెడగొడతానేమోనని భయపడ్డాను. కానీ, ఇప్పుడు సినిమానే నా జీవితమైపోయింది. నాపై సినీ రంగ అంతగా ప్రభావం చూపింది. అది నా ప్రపంచంగా మారిపోయింది’’ అని దుల్కర్‌ తెలిపారు.

దుల్కర్‌ తెలుగు, హిందీలతో పాటు తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుని ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయారు.  ప్రస్తుతం ఆయన సొంత బ్యానర్‌లో ‘కింగ్‌ ఆఫ్‌ కొట’ (King of Kotha) అనే సినిమాలో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని