Dunki: ఆ ధైర్యం బ్రిటిష్‌ వాళ్లకు ఎక్కడిది?

‘బ్రిటిష్‌ వాళ్లు మనల్ని ఒక శతాబ్దం పాటు పాలించారు. మనమెప్పుడూ వాళ్లని మీకు హిందీ వచ్చా అని అడగలేదు.

Updated : 06 Dec 2023 09:42 IST

‘బ్రిటిష్‌ వాళ్లు మనల్ని ఒక శతాబ్దం పాటు పాలించారు. మనమెప్పుడూ వాళ్లని మీకు హిందీ వచ్చా అని అడగలేదు. ఇంగ్లాండ్‌ వెళ్తుంటే మనల్ని మాత్రం ఇంగ్లిష్‌ వచ్చా అని అడిగేంత ధైర్యం వాళ్లకి ఎక్కడిది’ అంటున్నారు షారుక్‌ ఖాన్‌. మరి ఆయన ఇంగ్లాండ్‌కి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? దీని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలియాలంటే ‘డంకీ’ చూడాల్సిందే. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ, అగ్రకథానాయకుడు షారుక్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. తాప్సీ కథానాయిక. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇన్‌స్టా వేదికగా విడుదల చేశారు షారుక్‌. ‘ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. ఈ ట్రైలర్‌ స్నేహం, కామెడీ, భావోద్వేగాలతో పాటు కుటుంబ జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంటుంది. నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయమిద’ని వ్యాఖ్యల్ని జోడించారు. ‘ఈ కథను నేను మొదలు పెట్టాను. నేనే పూర్తి చేస్తాను’, ‘తీరని అవసరం ఒకరిని ఇల్లు వదిలేలా చేస్తుంది’ లాంటి సంభాషణలతో కూడిన ఈ ట్రైలర్‌ యాక్షన్‌, ప్రేమ లాంటి భావోద్వేగాల కలయికలో సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 22న రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని