Eagle: ‘ఈగల్’ రిలీజ్ డేట్.. ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించిన నిర్మాణ సంస్థ

రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle). దీని సోలో రిలీజ్ డేట్‌ కోసం నిర్మాణ సంస్థ ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించింది.

Updated : 19 Jan 2024 12:44 IST

హైదరాబాద్‌: రవితేజ నటించిన ‘ఈగల్‌’ (Eagle) రిలీజ్ డేట్ కోసం నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించింది. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు అదే రోజు మరికొన్ని చిత్రాలు విడుదలవుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన ‘సోలో రిలీజ్ డేట్‌’ మాట నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఛాంబర్‌ను కోరింది. తమకు సోలో డేట్‌ వచ్చేలా సహకరించాలని లేఖ రాసింది.

‘ఈగల్‌’ (Eagle) విషయానికొస్తే.. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో రవితేజ విభిన్న పార్శ్వాల్లో కనిపించనున్నారు. ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ నటించారు. నవదీప్‌, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని