గ్రామాన్ని దత్తత తీసుకున్న పృథ్వీ.. నవ్వులే నవ్వులు

హైపర్‌ ఆది, బుల్లట్‌ భాస్కర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ తదితరులంతా ఒకే గ్రామంలో నివసిస్తుంటారు. కరవు కారణంగా ఆ ఊరిని వదిలివెళ్లిపోవాలనుకుంటారు.

Updated : 24 Nov 2022 12:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైపర్‌ ఆది, బుల్లెట్‌ భాస్కర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ తదితరులంతా ఒకే గ్రామంలో నివసిస్తుంటారు. కరవు కారణంగా ఆ ఊరిని వదిలివెళ్లిపోవాలనుకుంటారు. అప్పుడే సడెన్‌ ఎంట్రీ ఇచ్చి.. ‘మీరెవ్వరూ ఎక్కడికి వెళ్లనవసరం లేదు. మీ ఊరిని నేను దత్తత తీసుకుంటున్నా’ అని మాటిస్తారు నటుడు పృథ్వీ. మీకున్న సమస్యలేంటో చెప్పమని పృథ్వీ అడగ్గా.. ఆది, శ్రీను చెప్పిన సిల్లీ సమస్యలు నవ్వులు పంచాయి. ఒకే ఊరిలో ఉంటున్న శ్రీను, రోహిణి మధ్య సాగిన కామెడీ పంచ్‌లు, భాస్కర్‌ జోకులు పొట్ట చెక్కలయ్యేలా చేశాయి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడ.. ప్రతి ఆదివారం మనకి వినోదం పంచే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో. జులై 11న ప్రసారంకానున్న (ఈటీవీలో) ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈసారి ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘జబర్దస్త్‌’ రాము కొరియోగ్రఫీ చేయగలడని ఈ వేదికపై నిరూపించాడు. అల్లు రామలింగయ్యలా దర్శనమిచ్చి, ‘ముత్యాలు వస్తావా’ అనే పాట పాడి అదుర్స్‌ అనిపించుకున్నాడు సుధాకర్‌. మరి ఈ సందడంతా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని