సుస్మిత వల్ల నా లైఫ్ మారింది..!
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను కలిసిన తర్వాత తన జీవితం ఎంతో మారిందని ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్ తెలిపారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన రోహ్మాన్ అనుకోని విధంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించారు....
పెళ్లి జరిగితే బయటపెడతాం: రోహ్మాన్‌షాల్
ముంబయి: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను కలిసిన తర్వాత తన జీవితం ఎంతో మారిందని ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్ అన్నారు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన రోహ్మాన్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే వయసులో తనకంటే పెద్దదైన సుస్మితాసేన్‌తో పరిచయం.. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే విషయం తెలిసిందే.
కాగా, తాజాగా రోహ్మాన్ తన ప్రేయసి సుస్మితాసేన్ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘మోడల్‌గా ముంబయికు వచ్చిన రెండేళ్ల తర్వాత సుస్మిత నాకు పరిచయమయ్యింది. అప్పటి నుంచి నా జీవితం ఎంతో మారిపోయింది. స్టార్ లైఫ్ ఎలా ఉంటుందో బాహ్య ప్రపంచానికి తెలీదు. వాళ్లతో కలిసి ఉన్నప్పుడే మనకు వాళ్ల కష్టాలు, కన్నీళ్లు అర్థమవుతాయి. నాకు కూడా తనని కలిసిన తర్వాత జీవితమంటే ఏమిటో సరిగ్గా అర్థమైంది’
‘మేమిద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామా?అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నేను, సుస్మిత, ఆమె పిల్లలు ఒక కుటుంబంలా ఉంటున్నాం. కొన్నిసార్లు నేను ఒక తండ్రిగా, మరికొన్నిసార్లు స్నేహితుడిగా ఉంటూ ఆ పిల్లల్ని చూసుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. కాబట్టి పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్పకుండా చెబుతాం’ అని రోహ్మాన్ వివరించారు.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!