Fahadh Faasil: అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్‌ ఫాజిల్‌

తానెందుకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరో ప్రముఖ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే?

Updated : 01 Jun 2024 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ఇన్‌స్పెక్టర్‌ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil). ఇటీవల ‘ఆవేశం’ (Aavesham) చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈసందర్భంగా ఓ మీడియా సంస్థ ఆయనతో ముచ్చటించింది. ఈ క్రమంలో.. తానెందుకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘‘ఇంటర్వ్యూలు ఇవ్వడం స్వతహాగా నాకు ఇష్టం ఉండదు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. అందుకే వాటికి దూరంగా ఉంటాను తప్ప మరే ఉద్దేశం లేదు. నా సినిమాలే మాట్లాడాలని భావిస్తా. ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు ఇంటర్వ్యూల కంటే సినిమాలే నాకు సులువైన మార్గం’’ అని తెలిపారు.

ఫొటోలకు పోజిలివ్వడం కూడా తనకు రాదని, అందుకే ఎవరైనా సెల్ఫీ కోసం వస్తే అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తానని ఓ సందర్భంలో తెలిపారు. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD) బారిన పడినట్టు ఇటీవల ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’లోని కీలక పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకురానున్నారు ఫహాద్‌. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘వేట్టయాన్‌’లోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని