Vijay Devarakonda: హోలీ సంబరాల్లో ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్‌.. డ్యాన్స్‌తో అలరించిన మృణాల్

‘ఫ్యామిలీ స్టార్‌’గా పలకరించేందుకు విజయ్‌ దేవరకొండ సిద్ధమయ్యారు.

Published : 25 Mar 2024 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)- మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇందులో భాగంగానే మూడో పాటను విడుదల చేసింది. అభిమానుల మధ్య హోలీ సెలబ్రేట్‌ చేసుకున్న తర్వాత ‘మధురము కదా..’ అనే లవ్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ హోలీ వేడుకల్లో విజయ్, మృణాల్, దిల్‌ రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘అందరికీ పరీక్షలు అయిపోయాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాకు కుటుంబసమేతంగా వచ్చి ఎంజాయ్‌ చేయండి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందీ చిత్రం’ అన్నారు.

పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌ రాజు - శిరీశ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఇందులోని ‘ఐరనే వంచాలా ఏంటి’ డైలాగ్‌, ‘కల్యాణీ వచ్చా వచ్చా..’ పాట సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి. తాజాగా జరిగిన హోలీ వేడుకల్లో కూడా నటీనటులిద్దరూ ఈ పెళ్లి పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రం (Family Star) ట్రైలర్‌ 28న విడుదలకానుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని