కోట్లతో సినిమా.. రీమేక్ ముద్ర
సినీ ప్రియులకు ఓ చక్కని, విభిన్నమైన కథను అందించాలనే ఉద్దేశంతో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తారు దర్శక నిర్మాతలు. అది విడుదల కాకముందే.. ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్ చూసి కొంతమంది నెటిజన్లు దానిపై రీమేక్ ముద్ర వేస్తుంటారు....
స్పందించిన దర్శకుడు
చెన్నై: సినీ ప్రియులకు ఓ చక్కని, విభిన్నమైన కథను అందించాలనే ఉద్దేశంతో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తారు దర్శక నిర్మాతలు. అది విడుదల కాకముందే.. ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్ చూసి కొంతమంది నెటిజన్లు దానిపై రీమేక్ ముద్ర వేస్తుంటారు. ఇది మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇదే విధంగా, గతకొన్నిరోజుల నుంచి ఓ స్టార్ హీరో చిత్రానికి సంబంధించిన టీజర్ చూసి పలువురు నెటిజన్లు దానిని హాలీవుడ్ రీమేక్‌గా అభివర్ణిస్తున్నారు. ఆ కామెంట్లపై తాజాగా చిత్ర దర్శకుడు స్పందించారు.
కోలీవుడ్ ప్రముఖ నటుడు శింబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మానాడు’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘నీ టైమ్ ఇప్పుడే ప్రారంభమైంది’ అంటూ శింబు ఆకట్టుకున్నారు. హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘టెనెట్’కు ఇండియన్ వెర్షన్‌లా ‘మానాడు’ ఉందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. దీంతో సదరు కామెంట్లపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు.
‘మా ‘మానాడు’ టీజర్‌ను హాలీవుడ్‌లో తెరకెక్కిన ‘టెనెట్’తో పోల్చడం ఎంతో ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు చిత్రాలకు ఎలాంటి పోలిక లేదు. అంతేకాకుండా నాకు ‘టెనెట్’ అర్థం కాలేదు. కాబట్టి ట్రైలర్ విడుదలయ్యే వరకూ వేచి ఉండండి. అప్పుడు మరో సినిమాతో పోలుస్తారేమో’ అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి
నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!